కలం, మెదక్ బ్యూరో: తుఫాన్ నేపథ్యంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల వద్ద టార్పాలిన్లు ఏర్పాటు చేయాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (Gudem Mahipal Reddy) జిల్లా పౌరసరఫరా శాఖ అధికారులను ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే గోదాములకు తరలించాలని సూచించారు. ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని చిన్నకంజర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాల్లో అందిస్తున్న వసతులను రైతులను అడిగి తెలుసుకున్నారు. ధాన్యాన్ని దళారులకు విక్రయించవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి నిర్ణీత గడువు లోగా డబ్బులు చెల్లించాలని కోరారు. రైతులకు బకాయి పడిన బోనస్ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రను వీడాలని డిమాండ్ చేశారు.
Also Read : రోజుల తరబడి ఆందోళన చేస్తారా?: సుప్రీం కోర్టు
Follow Us On: X(Twitter)

