ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి: ఎంపీ ఈటల

కలం, నిర్మల్‌: జాతీయ ఆరోగ్య మిషన్‌ (NHM) ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఎంపీ ఈటల రాజేందర్‌ (MP Eatala Rajendar), సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు (MLA Palvai Harish Babu) డిమాండ్‌ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారం నాటికి 22వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సమ్మె శిబిరాన్ని ఎంపీ ఈటల రాజేందర్‌ , ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌ బాబు, బీజేపీ నేతలు సందర్శించి ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు.

ఉద్యోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మెకు బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ప్రభుత్వం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై సానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. గత 22 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం ఇప్పటివరకు చర్చలకు పిలవకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. వెంటనే వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>