గద్వాల నియోజకవర్గంలో పింఛన్ల పండుగ!

కలం, జోగులాంబ గద్వాల: పేదల ఆత్మగౌరవానికి భరోసా కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (Bandla Krishna Mohan Reddy) అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. గురువారం గద్వాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గట్టు, మల్దకల్ మండలాలకు చెందిన 1,702 మంది లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన చేయూత పింఛన్ల (Cheyutha Pension) ప్రొసీడింగ్ పత్రాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

గట్టు మండలంలో 942 మందికి, మల్దకల్ మండలంలో 760 మందికి కొత్త పింఛన్లు మంజూరయ్యాయి. ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, గీత, చేనేత కార్మికులు తదితర అర్హులకు పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే (Krishna Mohan Reddy) మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, సన్నబియ్యం పంపిణీ, సన్నాలకు బోనస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్ల పథకం వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు వివరించారు.

ఈ కార్యక్రమాల్లో నాయకులు పటేల్ ప్రభాకర్ రెడ్డి, గడ్డం కృష్ణారెడ్డి,బండారి భాస్కర్, జంబు రామన్ గౌడ్, సత్యరెడ్డి, విక్రమ్ సింహారెడ్డి, మాజీ ఎంపీపీలు విజయ్, రాజారెడ్డి, మాజీ జెడ్పీటీసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ వీరన్న, సింగిల్ విండో వైస్ ప్రెసిడెంట్ విష్ణు, గట్టు మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు శ్రీరాములు గౌడ్, మల్దకల్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు తూమ్ కృష్ణారెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Also Read : అంబానీల‌ నుంచి పెళ్లి ప్ర‌పోజ‌ల్ వ‌చ్చింది: అన‌న్యా బిర్లా

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>