కలం, నిర్మల్: నిర్మల్ నియోజకవర్గంలోని రెండు ప్రధాన రహదారుల అభివృద్ధికి (Road Development) రూ. 95 కోట్ల నిధులు మంజూరు చేయాలని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. హైదరాబాద్లో గురువారం 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రిని ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. సెంట్రల్ రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (సీఆర్ఐఎఫ్) కింద నిధులు కేటాయించాలని కోరుతూ రెండు రహదారుల ప్రతిపాదనలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
నర్సాపూర్ (డబ్ల్యూ) నుంచి బాబాపూర్, కంజర్, లక్ష్మణచాంద, ధర్మారం మీదుగా సోన్ వరకు రహదారి నిర్మాణానికి రూ.55 కోట్లు, నిర్మల్ నుంచి లంగ్డాపూర్, వెంగ్వపేట్, ఆలూర్, బోరిగాం, యాకర్పల్లి మీదుగా సారంగాపూర్ వరకు రహదారి అభివృద్ధికి రూ.40 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించి, నిధుల మంజూరుకు హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు.
Also Read : కాంగ్రెస్ నేతలు తిన్న అవినీతి సొమ్ము కక్కిస్తాం: కేటీఆర్
Follow Us On : WhatsApp

