Mobile Popup Ad
Mobile Popup Ad

ఆర్టీసీ బస్సులో మంటలు.. ఎంజీబీఎస్‌లో భయాందోళన

కలం, వెబ్ డెస్క్ : ఎంజీబీఎస్‌లోని (MGBS) గద్వాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బస్సు స్టాండ్‌లో నిలిపి ఉన్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడ ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. మంటలు వేగంగా వ్యాపించడంతో ప్రయాణికులు వెంటనే బస్సు దిగి పరుగులు తీశారు. ఈ ఘటనతో ఎంజీబీఎస్ పరిసరాలలో కొద్దిసేపు కలకలం రేగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. పూర్తి కారణాలు దర్యాప్తులో వెలుగులోకి రానున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>