విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి: గద్వాల కలెక్టర్

కలం, జోగుళాంబ గద్వాల: ప్రతి ఒక్కరూ విద్యార్థి దశ నుంచే ఉన్నత లక్ష్యాలతో ముందుకెళ్లాలని, ప్రణాళికాబద్ధంగా చదివి మంచి ఫలితాలు సాధించాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ (Gadwal Collector) అన్నారు.శుక్రవారం ధరూర్ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు.

ఈ సందర్భంగా పలువురు విద్యార్థులతో మాట్లాడి వారి చదువు, అభ్యసన సామర్ధ్యాలను తెలుసుకున్నారు. విద్యలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. పదో తరగతి విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ఇప్పటి నుంచే ప్రణాళికతో బోధన చేపట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు.
విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ అందించడంతో పాటు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనేలా ప్రోత్సహించాలని తెలిపారు. విద్యార్థులు క్రమం తప్పకుండా తరగతులకు హాజరై శ్రద్ధగా చదువుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు వడ్డించే మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు పోషకాహారంతో కూడిన భోజనం అందించాలని ఆదేశించారు. వంట, స్టోర్ గదులను పరిశీలించి పరిశుభ్రతను పాటించాలని సూచించారు.

కేజీబీవీకి సంబంధించిన రిజిస్టర్లను పరిశీలించిన కలెక్టర్ తగు సూచనలు చేశారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులను పూర్తిస్థాయిలో కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. పాఠశాలలో జరుగుతున్న మౌలిక వసతుల పనులను కలెక్టర్ పరిశీలించారు. విద్యుత్, డ్రైనేజీ సమస్యలను సిబ్బంది కలెక్టర్ దృష్టికి తీసుకురాగా సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ పర్యటనలో తహసీల్దార్ నందిని, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>