రూ.కోట్లు దోచేసిన సైబర్ నేరస్థుల అరెస్ట్

కలం, నిర్మల్: దేశ వ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడుతూ రూ.కోట్లు దోచేస్తూ.. బీహార్‌లో అతి సామాన్యులుగా జీవిస్తున్న అయిదుగురు నిందితులను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు (Adilabad Police) అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్పీ అఖిల్ మహాజన్ శుక్రవారం వివరాలు వెల్లడించారు. వీరంతా దేశవ్యాప్తంగా సుమారు 500 సైబర్ నేరాలకు పాల్పడి, రూ.3.5 కోట్ల వరకు మోసాలకు పాల్పడినట్లు వివరించారు. ఒక్క తెలంగాణలోనే 90 ఫిర్యాదులు నమోదైనట్లు పేర్కొన్నారు. నిందితులు మొదట నకిలీ ఫర్టిలైజర్ ఫ్రాంఛైజీ వెబ్‌సైట్ ఏర్పాటు చేసి, ఆన్‌లైన్ అప్లికేషన్ల ద్వారా బాధితుల ఆధార్, పాన్, బ్యాంకు ఖాతాల వివరాలను సేకరించేవారని తెలిపారు. అనంతరం సర్వీస్ ఫీజు, లైసెన్స్ ఫీజు, ట్రేడ్ ట్రాన్స్‌ఫర్ ఫీజుల పేరుతో విడతల వారీగా లక్షలాది రూపాయలు వసూలు చేసేవారన్నారు.

రుణాల పేరిట వసూళ్లు..

బజాజ్ లోన్ పేరుతో నకిలీ ఆన్‌లైన్ రుణాలు ఎర వేసి, బాధితుల వ్యక్తిగత వివరాలు సేకరించి వివిధ రకాల ఫీజుల పేరుతో డబ్బులు వసూలు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టి అయిదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. వీరి నుంచి 10 ఫోన్లు, రూ.70 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బాధితుల నుంచి మోసం చేసి తీసుకున్న నగదులో రూ.8 లక్షలను బ్యాంకు ఖాతాలు, స్టాక్ మార్కెట్ షేర్లలో పెట్టుబడిగా పెట్టినట్లు గుర్తించి ఆ మొత్తాన్ని కూడా జప్తు చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>