హిందూ దేవుళ్లపై సీఎం వ్యాఖ్యలు.. గద్వాలలో బీజేవైఎం ఆందోళన

కలం, జోగులాంబ గద్వాల: సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) హిందూ దేవుళ్ళపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర బీజేపీ పార్టీ పిలుపు మేరకు మంగళవారం గద్వాల‌‌ పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద బీజేవైఎం (BJYM) జిల్లా అధ్యక్షులు బాబుల్‌రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బాబుల్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం పదవిలో ఉన్న వ్యక్తి ప్రజల భక్తి భావాలను, హిందూ దేవతల గౌరవాన్ని దెబ్బతీయడం అత్యంత దురదృష్టకరమని, ఇది సీఎం బాధ్యతా రాహిత్యమైన ప్రవర్తన అని విమర్శించారు. రాముడు ఉత్తరాది దేవుడని, శివుడు దక్షిణాది దేవుడని” మాట్లాడుతూ దేవుళ్లను, సనాతన ధర్మాన్ని కేవలం రాజకీయ లబ్ధి కోసం విడదీయడం సరికాదని అన్నారు.

హిందువుల ఆత్మగౌరవాన్ని, మనోభావాలను, నమ్మకాలను దెబ్బతీసే ఇలాంటి వ్యాఖ్యలను బీజేపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని, ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా కోశాధికారి ఆకారం రమేష్, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు దేవదాస్, మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, నాయకులు శ్రీను, బీజేపీ సీనియర్ నాయకులు పాండు, గాంజ సాయి, సతీష్, నరసింహ శెట్టి, నాగ మల్లయ్య, రెడప్ప, ఓంకార్ తదితరులు పాల్గొన్నారు.

Also Read : నీరు ధండా బంగారు గురి.. భారత్‌కు మరో గోల్డ్ మెడల్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>