Mobile Popup Ad
Mobile Popup Ad

కాంగ్రెస్​ నేతలపై దాడి హేయం: గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

కలం, నిజామాబాద్ బ్యూరో : కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి (MLA Katipally) ఇంటి వద్దకు వెళ్లిన సీనియర్ కాంగ్రెస్ నేత గిరెడ్డి మహేందర్ రెడ్డిపై దాడి చేయడం సరికాదని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి (Gaddam Chandrashekhar Reddy) వ్యాఖ్యానించారు. సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉన్న పోసానిపేట్ మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డిని ఆయన పరామర్శించి, ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా గడ్డం చంద్రశేఖర్ రెడ్డి పోలీస్ స్టేషన్ నుండే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో ఫోన్లో మాట్లాడించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల కుటుంబాలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మహేష్ కుమార్ గౌడ్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

Read Also: సవాళ్లు, ప్రతిసవాళ్లు.. కామారెడ్డిలో మరోసారి ఉద్రిక్తత

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>