epaper
Sunday, February 22, 2026
epaper

మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డికి ఏసీబీ నోటీసులు

కలం, వెబ్ డెస్క్ : మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి (Alla Ramakrishna Reddy) కి ఏసీబీ (ACB) నోటీసులు జారీ చేసింది. అమరావతి (Amaravati) ఇన్నర్ రింగ్ రోడ్ కుంభకోణం కేసులో భాగంగా ఈ నోటీసులు అందజేశారు. ఈ కేసుకు సంబంధించి కోర్టులో హాజరై తన వాదనలు వినిపించుకోవచ్చని నోటీసుల్లో పేర్కొన్నారు. అధికారులు జారీ చేసిన నోటీసుల ప్రకారం ఈ నెల 27న విజయవాడలోని ఏసీబీ కోర్టుకు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాజెక్టుకు సంబంధించిన అవకతవకలపై ఇప్పటికే దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆళ్ల రామకృష్ణా రెడ్డి (Alla Ramakrishna Reddy) కోర్టుకు హాజరవుతారా లేదా అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>