Mobile Popup Ad
Mobile Popup Ad

మావోయిస్టుల కుట్ర భగ్నం: అటవీ ప్రాంతంలో భారీ ఆయుధ నిక్షేపాలు సీజ్!

కలం, వెబ్‌ డెస్క్ : మావోయిస్టులు (Maoists) అలజడి సృష్టించడానికి అడవుల్లో భూగర్భంలో దాచిన భారీ ఆయుధ కర్మాగారాన్ని గడ్చిరోలి (Gadchiroli) పోలీసులు విజయవంతంగా ధ్వంసం చేశారు. లొంగిపోయిన మావోయిస్టుల నుంచి సేకరించిన అత్యంత రహస్య సమాచారం ఆధారంగా ఈ భారీ ఎన్‌కౌంటర్ నిరోధక ఆపరేషన్ చేపట్టారు. గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టుల ప్రాబల్యం దాదాపు ముగిసిపోతున్న తరుణంలో పోలీసులకు దొరికిన ఈ ఆయుధ సంపద శాంతిభద్రతల పరిరక్షణలో కీలక ముందడుగుగా నిలిచింది.

ఇటీవల ఆపరేషన్ ఫైనల్ స్ట్రైక్ కింద గడ్చిరోలి పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టులను విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోమ్‌కెన్ బినగుండ అటవీ ప్రాంతంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను భూమిలో దాచినట్లు వారు అంగీకరించారు. ఈ సమాచారంతో గడ్చిరోలి (Gadchiroli) ఎస్పీ ఎం. రమేష్ ఆధ్వర్యంలో స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ గడ్చిరోలి, ప్రాణహిత విభాగాలు కలిపి ఆరు బృందాలుగా ఏర్పడ్డాయి. బాంబు నిరోధక, నిర్వీర్య విభాగం (BDDS) రెండు బృందాలు మే 21న అడవిలోకి రంగంలోకి దిగాయి.

మే 22న భద్రతా బలగాలు పోమ్‌కెన్ బినగుండ ఉత్తర అటవీ ప్రాంతాన్ని పూర్తిగా చుట్టుముట్టాయి. బీడీడీఎస్ సిబ్బంది అణువణువూ తనిఖీ చేయగా భూమిలో పాతిపెట్టిన లేత్ మిషన్, బిజిఎల్ పైపులు, 12 బోర్ పైపులు, ఇన్వర్టర్, జనరేటర్, బ్యాటరీలు, గ్రైండింగ్, డ్రిల్లింగ్ మిషన్లు, జిగ్సా సా మిషన్, ప్రెషర్ పంప్, సోలార్ ప్యానెల్స్, 20 అడుగుల ఫుట్‌బాల్ పైపు వంటి ప్రమాదకర వస్తువులు లభ్యమయ్యాయి. వీటితో పాటు మావోయిస్టుల విప్లవ సాహిత్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. సీనియర్ అధికారుల ఆదేశాల మేరకు లభించిన సాహిత్యాన్ని ఘటనా స్థలంలోనే సిబ్బంది పూర్తిగా బూడిద చేశారు.

ప్రభుత్వ వ్యతిరేక దాడులకు, ఎన్నికల సమయంలో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకోవడానికి మావోయిస్టులు ఈ ఆయుధాలను తయారు చేస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు. ఎస్పీ ఎం. రమేష్ పర్యవేక్షణలో అడిషనల్ ఎస్పీ కార్తీక్ మధిర, అడిషనల్ ఎస్పీ గోకుల్ రాజ్, డిప్యూటీ ఎస్పీ విశాల్ నాగర్గోజే ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా నడిపించారు. అద్భుతమైన ప్రతిభ కనబరిచిన సిబ్బందిని ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు.

Read Also: హీట్ వేవ్ ఎఫెక్ట్: ఆల్ టైమ్ హైకి విద్యుత్ వినియోగం!

Follow Us On: X (Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>