Mobile Popup Ad
Mobile Popup Ad

ఏ క్షణమైనా బాంబు పేలవచ్చు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బెదిరింపు

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ శివారు ప్రాంతమైన శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (Shamshabad Airport)కు బాంబు బెదిరింపు కలకలం రేపుతోంది. ఆమ్‌స్టర్‌డామ్‌ నుంచి శంషాబాద్‌ వస్తున్న ఫ్లైట్ లో బాంబు ఉన్నట్లు మెయిల్‌ రావడంతో సంబంధిత అధికారులు అప్రమత్తం అయ్యారు. విమానాశ్రయంలో ల్యాండింగ్ అయ్యేలోపు ఏ క్షణమైనా బాంబు పేలవచ్చు అంటూ అగంతకుడు మెయిల్‌ పంపించారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా విమానాశ్రయ భద్రతా సిబ్బంది రంగంలోకి దిగింది.

ఆ సమయంలోనే విమానం సేఫ్‌ ల్యాండింగ్‌ అయ్యింది. దీంతో వేంటనే విమానంలోనుంచి ప్రయాణికులను కిందకు దింపి ఐసోలేషన్ ప్రాంతానికి తరలించారు. విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి బాంబు లేదని నిర్ధరించారు. విషయం తెలుసుకున్న ప్రయాణికులు తొలుత భయాందోళనకు గురైన.. బాంబు లేదని అధికారులు తేల్చడంతో ఊపిరి పీల్చుకున్నారు. బాంబు బెదిరింపు మెయిల్‌పై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Read Also: ఫ్యూచర్ సిటీ వివాదం.. ట్రబుల్‌లో ట్రబుల్ షూటర్ హరీశ్‌రావు

Follow Us On: X (Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>