రూ.57 లక్షలతో ఏటీఎం వ్యాన్ డ్రైవర్ జంప్

కలం, డెస్క్ : గచ్చిబౌలిలో (Gachibowli) షాకింగ్ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గచ్చిబౌలిలోని గోపన్ పల్లిలో ఉన్న యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో క్యాష్‌ డిపాజిట్ చేయడానికి వ్యాన్ లో ఇద్దరు కస్టోడియన్లు, ఒక గార్డు, వ్యాన్ డ్రైవర్ వెళ్లారు. సాయంత్రం 4.30 గంటల సమయంలో ఏటీఎంలో ఇద్దరు కస్టోడియన్లు డబ్బులు డిపాజిట్ చేస్తున్నారు. గార్డు అప్పుడే వాష్ రూమ్ కు వెళ్లడంతో.. డ్రైవర్ అంజిత్ కుమార్ అదే అదునుగా వెహికల్ తో సహా రూ.57 లక్షలతో పారిపోయాడు.

దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా.. బృందాలుగా ఏర్పడి గాలించడం ప్రారంభించారు. డ్రైవర్ అంజిత్ కుమార్ తెల్లాపూర్ (Tellapur) సమీపంలో వ్యాన్ ను వదిలేసి రూ.57 లక్షలతో పారిపోయాడని పోలీసులు చెప్పారు. అంజిత్ తిరుమలగిరిలో నివాసం ఉంటున్నాడని.. పూర్తి సమాచారం ఉండటంతో త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.

Read Also: చట్టసభల్లో సభ్యులకు భద్రత ఎంత? మోదీకి సైతం ముప్పు?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>