Mobile Popup Ad
Mobile Popup Ad

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కిషన్‌రెడ్డి

కలం, వెబ్ డెస్క్: ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బీజేపీ నేత, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసిన ఆయనను అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతించారు. ఉగాది పండుగ సందర్భంగా శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆశీస్సుల కోసం వచ్చినట్లు తెలిపారు. ప్రపంచమంతా యుద్ధభూమిలో ఉంటే భారతదేశం సేఫ్ జోన్‌లో ఉందని ఆయన తెలిపారు.

ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలో ఆధ్యాత్మికత, శాంతి, అభివృద్ధి నడుస్తోందని చెప్పారు. అటు తిరుమలలో భారీగా భక్తుల రద్దీ నెలకొంది. ఉగాది పండుగ రావడంతో ఉద్యోగులు సెలవులు తీసుకొని దేవాలయ దర్శనం చేసుకుంటూ మొక్కులు తీర్చుకుంటున్నారు. టోకేన్ లేని భక్తుల శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 57,272 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,842 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. గురువారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.37 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>