నేడు తిరుమలకు సీఎం చంద్రబాబు కుటుంబం

కలం, వెబ్ డెస్క్: శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం నేడు తిరుమలకు సీఎం చంద్రబాబు (Chandrababu) కుటుంబం వెళ్లనుంది. మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శ్రీవారికి మొక్కులు చెల్లించనున్నారు. ఈ సాయంత్రం ముఖ్యమంత్రి తిరుమల చేరుకోనునున్నారు. రాత్రికి గాయత్రీ నిలయం అతిథిగృహంలో బస చేయనున్నారు. రేపు ఉదయం కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకోనున్నారు.

మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా రేపు ఒక్కరోజు అన్నవితరణకు విరాళం ఇవ్వనున్నారు. ఒక్కరోజుకు అయ్యే ఖర్చు రూ.44 లక్షలను ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు విరాళం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అనంతరం అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు సీఎంతో పాటు కుటుంబ సభ్యులు అన్నవితరణ చేయనుంది. రేపు ఉ. 10 గం.కు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని సీఎం చంద్రబాబు (Chandrababu) సందర్శించనున్నారు. ఉదయం 10.45 గం.కు టీటీడీ వాటర్, ఫుడ్ అనాలసిస్ ల్యాబ్‌ ను ప్రారంభించనున్నారు. స్టేట్ ఫుడ్ ల్యాబ్‌ను సైతం సీఎం ప్రారంభించనున్నారు. రేపు ఉదయం 11.30 గంటలకు తిరుమల నుంచి సీఎం తిరుగుపయనమవుతారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>