గ్రామస్తుల కీలక నిర్ణయం: డీజేలు, ప్రీ వెడ్డింగ్ షూట్‌లపై నిషేధం

కలం, వెబ్​ డెస్క్​ : కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం ఖైరిగూడ (Khairiguda) గ్రామస్తులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో జరిగే పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల్లో డీజేల వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు వారు ఏకగ్రీవంగా తీర్మానించారు. కేవలం డీజేలే కాకుండా, హల్దీ వేడుకలు, ప్రీ వెడ్డింగ్ షూట్‌లపై కూడా గ్రామస్తులు నిషేధం విధిస్తూ ప్రతిజ్ఞ చేశారు.

ఈ నిబంధనలను ఎవరైనా అతిక్రమిస్తే వారికి భారీ జరిమానా విధించాలని కూడా గ్రామ కమిటీ నిర్ణయించింది. ఎవరైనా డీజేలు పెట్టినా లేదా నిషేధించిన వేడుకలు నిర్వహించినా వారికి 50,000 రూపాయల జరిమానా విధిస్తామని గ్రామస్తులు తీర్మానం చేశారు.

అంతేకాకుండా రాబోయే శ్రీరామనవమి పండుగ అనంతరం గ్రామంలో మద్యపానంతో పాటు గుడుంబా తయారీ, అమ్మకాలను పూర్తిగా నిషేధించేందుకు కృషి చేస్తామని వారు ప్రతిజ్ఞ చేశారు. సామాజిక మార్పు కోసం ఖైరిగూడ (Khairiguda) గ్రామస్తులు తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>