Mobile Popup Ad
Mobile Popup Ad

బాలీవుడ్ హీరో ర‌ణ‌వీర్ సింగ్‌కు బిగ్ షాక్‌!

క‌లం, వెబ్‌డెస్క్‌: బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్‌(Ranveer Singh)పై ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. డాన్-3 చిత్ర దర్శకుడు ఫర్హాన్ అఖ్తర్ (Farhan Akhtar), అతని నిర్మాణ సంస్థ ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ చర్యలు చేపట్టారు. రణవీర్ సింగ్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నుండి అకస్మాత్తుగా తప్పుకున్నాడని, దీని వల్ల చిత్ర బృందానికి తీవ్ర నష్టం వాటిల్లిందని ఫర్హాన్ అఖ్తర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నిషేధం ప్రకారం రణవీర్ సింగ్‌తో ఎలాంటి వృత్తిపరమైన సంబంధాలు పెట్టుకోవద్దని అన్ని నిర్మాణ సంస్థలు, స్టూడియోలు, మ్యూజిక్ కంపెనీలకు ఫెడరేషన్ ఆదేశాలు జారీ చేసింది. టెక్నీషియన్లు, నటీనటులు ఎవరూ కూడా ఆయనతో కలిసి పని చేయకూడదని, నిబంధనలు ఉల్లంఘిస్తే క్రమశిక్షణా చర్యలు ఉంటాయని హెచ్చరించింది.

ఈ వివాదానికి ఆగస్టు 2023లోనే బీజం పడింది. అంతకుముందు డాన్ సిరీస్‌లో నటించిన షారూఖ్ ఖాన్ స్థానంలో రణవీర్ సింగ్‌ను కొత్త డాన్‌గా ఫర్హాన్ అఖ్తర్ ప్రకటించారు. అయితే, షారూఖ్ అభిమానుల నుండి సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్, ఒత్తిడి రావడంతో పాటు ఈ ప్రాజెక్ట్ అనేక సవాళ్లను ఎదుర్కొంది. దీనికి తోడు రణవీర్ మార్షల్ ఆర్ట్స్ శిక్షణ పొందాల్సి రావడం, ఫర్హాన్ అఖ్తర్ తన ఇతర నటన ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో సినిమా నిర్మాణం ఆలస్యమవుతూ వచ్చింది. మొదట జనవరి 2026లో షూటింగ్ ప్రారంభించి, ఇదే ఏడాది డిసెంబర్‌లో విడుదల చేయాలని భావించినప్పటికీ, లాజిస్టిక్స్ సమస్యల వల్ల అది సాధ్యపడలేదు. ఈ క్రమంలోనే రణవీర్ సింగ్ ప్రాజెక్ట్ నుండి అకస్మాత్తుగా తప్పుకోవడంతో వివాదం ముదిరి, చివరకు ఫిల్మ్ బాడీ నిషేధానికి దారి తీసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>