కలం, వెబ్ డెస్క్ : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్ సిటీ (Future City) ని ఫోర్త్ సిటీగా తీర్చిదిద్దేలా చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఇకపై వారంలో ఒకరోజు ఫ్యూచర్ సిటీ నుంచే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పాలన కొనసాగించేలా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రతినిధులతో అక్కడే చర్చలు జరగనున్నాయి. దీంతో పెట్టుబడి ఒప్పందాలకు ఫ్యూచర్ సిటీ వేదికగా మారబోతుంది.
ఫ్యూచర్ సిటీ డెవల్‌పమెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ)కు సీఎం చైర్మన్‌గా, డిప్యూటీ సీఎం వైస్ చైర్మన్‌గా ఉంటారు. దీంతో ఫ్యూచర్ సిటీలో (Future City) సీఎం రేవంత్ రెడ్డికి , అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అధికారులు ప్రత్యేక చాంబర్లను ఏర్పాటు చేశారు. ఎఫ్‌సీడీఏ భవనం మొదటి అంతస్తులో ఈ ప్రత్యేక చాంబర్లను ఏర్పాటు చేశారు. దీంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఫ్యూచర్ సిటీ బ్రాండింగ్ కానుంది. ప్రపంచ కంపెనీలను ఫ్యూచర్ సిటీకే రప్పిస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన త్వరలో అమల్లోకి రానుంది.
ప్రభుత్వ తాజా నిర్ణయంతో గతంలో సైబరాబాద్ కే పరిమితమైన సిటీ, ఇప్పుడు ఫోర్త్ సిటీ వైపు నకు మళ్లే అవకాశం ఉంది. హైదరాబాద్ సిటీ గ్రోత్ దృష్ట్యా పబ్లిక్ కూడా ఫోర్త్ సిటీ బాట పట్టేందుకు ఇప్పటికే సిద్ధమయ్యారు. హైదరాబాద్ నగరంపై పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించడంతో పాటు ఫ్యూచర్ సిటీకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే పలు ప్రభుత్వ కార్యాలయాలను కూడా ప్యూచర్ సిటీలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం అందుతోంది.
Read Also: ఆ భూమి వేలానికి రెడీ? హెచ్ఎండీఏ సంచలన నిర్ణయం!
Follow Us On: Instagram

