Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రముఖ మలయాళీ నటుడు సలీం కుమార్ కన్నుమూత

కలం, వెబ్ డెస్క్: మలయాళీ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు సలీం కుమార్ (Salim Kumar) మరణించారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న తరుణంలో గుండెపోటు రావడంతో కన్నుమూసినట్లు వైద్యులు వెల్లడించారు. జాతీయ ఉత్తమ నటుడు అవార్డ్ గ్రహీత అయిన 56 ఏళ్ల సలీం కుమార్ ఎన్నో చిత్రాల్లో తన నటనా నైపుణ్యంతో అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన మరణం చిత్ర పరిశ్రమకు పెద్ద లోటని మమ్ముట్టి సహా పలువురు నటీ నటులు, వివిధ రంగాలకు చెందిన వారు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

300కి పైగా చిత్రాల్లో..

కేరళలోని ఉత్తర పరవూర్‌లో 1969 అక్టోబర్ 10న జన్మించిన సలీం కుమార్‌కు చిన్నప్పటి నుంచీ కళలపై ఆసక్తి ఉండేది. కెరీర్‌లో 300కి పైగా చిత్రాల్లో నటించిన సలీం.. ప్రేక్షకులకు హాస్యాన్ని పంచి రంజింపజేశారు. మరీ ముఖ్యంగా 2003లో విడుదలైన క్లాసిక్ కల్ట్ మూవీ ‘సీఐడీ మూసా’లో మానసిక రోగిగా అద్భుతంగా నటించి ప్రశంసలు అందుకున్నారు.  2010లో విడుదలైన ‘ఆదమింటే మకన్ అబు’ చిత్రంలో నటనకు గాను ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని గెలుచుకున్నారు. అంతేగాకుండా తానే దర్శకత్వం వహించిన ‘కరుత జూతన్’ మూవీ కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారాన్ని గెలుచుకుంది. హాస్య నటుడిగా, దర్శకుడిగా చిత్ర పరిశ్రమపై సలీం కుమార్ చెరగని ముద్ర వేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>