కారులో డీజిల్​ నింపుకుని డబ్బులు ఇవ్వకుండా ఎస్కేప్​.. వీడియో వైరల్​

కలం, వెబ్​ డెస్క్​ : పెట్రోల్​ బంకులో డీజిల్​ కొట్టించుకుని డబ్బులు ఇవ్వకుండా డ్రైవర్​ కారుతో పరారైన ఘటన (Fuel Theft) గురుగ్రామ్‌లోని బిలాస్‌పూర్-పటౌడి రోడ్‌ జరిగింది. నల్లరంగు స్కార్పియో కారులో వచ్చిన వ్యక్తి పెట్రోల్ బంకు వద్ద వాహనాన్ని ఆపి ట్యాంక్ ఫుల్ చేయాలని సిబ్బందిని కోరాడు. సేల్స్‌మెన్ వాహనంలో పెట్రోల్ నింపుతుండగా, డ్రైవర్ ఒక్కసారిగా వేగంగా కారును స్టార్ట్ చేసి అక్కడి నుంచి ఎస్కేప్​ అయ్యాడు.

అప్పుడే అక్కడికి వచ్చిన బైకుపై బంకు సిబ్బంది కారు వెంట పరుగెత్తాడు. ఈ ఘటనకు సంబంధిన దృశ్యాలు పెట్రోల్​ బంకులో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ఘటనపై బంకు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు దర్యాప్తు చేపట్టారు.

కాగా, ఘటనకు సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో వైరగా మారింది. రూ.20 లక్షల కారు కొనిక్కొని రూ.6 వేల డిజీల్​ కోసం కక్కుర్తి పడడం ఏంటని నెటిజన్లు ఫైర్​ అవుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>