Mobile Popup Ad
Mobile Popup Ad

ఏపీలో తగ్గిన ఇంధన రద్దీ.. పరిస్థితి సాధారణం

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌( Andhra Pradesh) లో పెట్రోల్, డీజిల్ సరఫరా (Fuel Supply) మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 90 శాతం పెట్రోల్ బంకులలో ఇప్పటికే సాధారణ పరిస్థితి నెలకొనగా, రద్దీ కూడా గణనీయంగా తగ్గినట్లు అధికారులు తెలిపారు. నేడు (ఏప్రిల్ 29) 100 శాతం ఇంధన సరఫరా (Fuel Supply) అందుబాటులో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

గత కొన్ని రోజులుగా కొన్ని ప్రాంతాల్లో ఏర్పడిన సరఫరా అంతరాయాలు దాదాపు పూర్తిగా సరిదిద్దినట్లు సమాచారం. వాహనదారులకు అవసరమైన పెట్రోల్, డీజిల్ స్టాక్ బంకులలో సమృద్ధిగా ఉందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని అధికారులు పేర్కొన్నారు. సరఫరా వ్యవస్థను పూర్తిగా సాధారణ స్థితికి తీసుకురావడానికి నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>