కలం, వెబ్ డెస్క్ : నేడు తెలంగాణ (Telangana) లో టెన్త్ విద్యార్థులకు కీలకమైన రోజు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన 10వ తరగతి పరీక్షల ఫలితాలను (SSC Results 2026) విద్యాశాఖ మధ్యాహ్నం 2 గంటలకు అధికారికంగా విడుదల చేయనుంది. ఈ సంవత్సరం మొత్తం సుమారు 5.08 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలను విద్యార్థులు ఆన్‌లైన్‌లో సులభంగా చూసుకునేలా అధికారులు ప్రత్యేక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.
విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్‌ను ఉపయోగించి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఫలితాల విడుదలకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఫలితాలపై విద్యార్థులు, తల్లిదండ్రులలో ఉత్కంఠ నెలకొంది. ఈ ఫలితాలు (SSC Results 2026) విద్యార్థుల భవిష్యత్ విద్యా మార్గాన్ని నిర్ణయించడంలో కీలకంగా మారనున్నాయి.

