కలం,వెబ్ డెస్క్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్ (Heritage) సంస్థకు ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (FSSAI) గట్టి షాక్ ఇచ్చింది. రెండు వేర్వేరు రాష్ట్రాల్లో నాణ్యతా లోపాల కారణంగా ఈ సంస్థపై చర్యలు తీసుకున్నారు. హర్యానాలో హెరిటేజ్ విక్రయిస్తున్న పాలల్లో ఉండాల్సిన కనీస స్థాయి ఫ్యాట్ లేదని నిర్ధారించిన అధికారులు, ఆ సంస్థకు ఒక లక్ష రూపాయల జరిమానా విధించారు. అలాగే నాణ్యత లేని పెరుగును విక్రయిస్తున్నట్లు గుర్తించి ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.
గత ఏడాది ఒడిశాలో (Odisha) కూడా హెరిటేజ్ (Heritage) ఉత్పత్తులపై ఫిర్యాదులు అందాయి. అక్కడ హెరిటేజ్ పాలు కల్తీ అవుతున్నాయన్న ఆరోపణలపై ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యత విషయంలో రాజీ పడటం వల్ల వినియోగదారుల ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరిస్తూ అప్పట్లోనే అధికారులు సీరియస్ అయ్యారు. వరుసగా రెండు రాష్ట్రాల్లో ఈ రకమైన చర్యలు తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Read Also: కూటమి ప్రభుత్వం కమ్మగా ఉంది: బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Follow Us On: Pinterest


