epaper
Wednesday, February 18, 2026
epaper

కూటమి ప్రభుత్వం కమ్మగా ఉంది: బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్: ఏపీలోని కుటమి ప్రభుత్వంలో (AP Govt) స్వల్ప లుకలుకలు అసంతృప్తులు మొదలైనట్టు కనిపిస్తోంది. జనసేన, టీడీపీ నేతకు మధ్య అక్కడక్కడా అసంతృప్తి ఉన్నట్టు కనిపిస్తున్నా కీలక నేతలు, ఎమ్మెల్యేలు పెద్దగా నోరు విప్పడం లేదు. బహిరంగంగా మాట్లాడటం లేదు. ఇక ఏపీలోని బీజేపీ నేతలు సైతం సఖ్యంగానే ఉన్నట్టు కనిపిస్తోంది. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి (Adinarayana Reddy)  చేసిన వ్యాఖ్యలు మాత్రం వివాదాస్పదంగా మారాయి. తిరుపతిలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ సభలో ఆది నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఏపీలో కూటమి ప్రభుత్వం కమ్మగా ఉంది’ అంటూ వ్యాఖ్యానించారు. గతంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రముఖ కవి గజ్జల మల్లారెడ్డి ప్రభుత్వ పనితీరును ఉద్దేశించి కమ్మగా ఉందని వ్యాఖ్యానించారని.. ఇప్పటికీ ఆ కమ్మదనం కొనసాగుతోందని చెప్పుకొచ్చారు.

అన్ని కులాలకు ప్రాధాన్యం ఇవ్వాలి

కూటమిలో అన్ని కులాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. కేవలం ఒక్క సామాజికవర్గానికి ప్రాధాన్యం ఇవ్వడం కరెక్ట్ కాదని ఎమ్మెల్యే (Adinarayana Reddy) విమర్శించారు. లడ్డూ వ్యవహారంలో వైసీపీ అడ్డంగా దొరికిపోయి కూడా బుకాయిస్తున్నదని మండిపడ్డారు. ఏపీలోని కూటమిలో బీజేపీ అత్యంత కీలకమని వ్యాఖ్యానించారు. బీజేపీ లేకపోతే ఏపీలో కూటమికి (NDA Alliance) ప్రాధాన్యం లేదని పేర్కొన్నారు. కూటమిలో బీజేపీ లేకపోతే మిగిలిన పార్టీలకు పెద్దగా ప్రాధాన్యం ఉండదని వ్యాఖ్యానించారు.

Read Also: పగలు సాఫ్ట్‌వేర్.. రాత్రి గజదొంగ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>