ఉచిత శిబిరాల పేరిట ప్రైవేట్ ఆసుపత్రుల దందా?

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: పేద ప్రజల బలహీనతను ఆసరాగా చేసుకుని మహబూబ్ నగర్ (Mahabubnagar) జిల్లాలో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు ఉచిత వైద్య శిబిరాల పేరిట దందాకు తెరలేపాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వచ్చిన ప్రజలకు ఆసుపత్రుల నిర్వాహకులు కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా.. సహనానికి పరీక్ష పెడుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిల్చొనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మంగళవారం మహబూబ్ నగర్ అభయప్రద హాస్పిటల్ నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంపై అక్కడకు వచ్చిన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కనీస సౌకర్యాలు లేని వైనం..

మూడు నాలుగు రోజులుగా ఉచిత వైద్య శిబిరం అంటూ ఆసుపత్రి నిర్వాహకులు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి జనాలు తరలివచ్చారు. అయితే, వచ్చిన పేషెంట్లకు కనీస సౌకర్యాలు సైతం కల్పించక ఆసుపత్రి యాజమాన్యం చేతులెత్తేసింది. ఫోన్ ద్వారా ఇప్పటికే పేర్లు నమోదు చేసుకున్న తమను కాదని, ఆసుపత్రి సిబ్బందికి తెలిసినవారు వస్తే త్వరగా పరీక్షలు చేసి పంపిస్తున్నారని పేషెంట్లు గొడవకు దిగారు. వచ్చినవారిని పేర్లు నమోదు చేసుకోవడానికి మూడు గంటలు, ఈసీజీ తీసుకోవడానికి మరో రెండు గంటలు, 2డీ ఎకో చేయించుకోవడానికి సాయంత్రం 6 గంటలు వేచి ఉండాల్సి వచ్చిందని వాపోయారు. అయినా తమ పేర్లు రాలేదంటూ చాలా మంది పేషెంట్లు తిరిగి వెళ్లిపోయారు.

మీడియాపై దురుసు ప్రవర్తన..

ఉచిత వైద్య శిబిరానికి హాజరైన వారికి సౌకర్యాలేవీ అంటూ మీడియా ప్రతినిధులు ఆసుపత్రి నిర్వాహకులను నిలదీయగా.. దురుసుగా ప్రవర్తించారు. మా ఇష్టం.. మీరెవరు అడగడానికి..? మీడియా అయితే ఏంటీ..? అంటూ నిర్లక్ష్య సమాధానమిచ్చారు. మేనేజర్ కృష్ణను కొందరు పేషెంట్లు నిలదీయగా.. ఆయన అంతే దురుసుగా సమాధానమిచ్చి వెళ్లిపోయారు. ఉచిత వైద్య శిబిరం పేరిట అభయ ప్రద ఆసుపత్రిలో జరిగిన విషయాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీనివాసులుకు ఫిర్యాదు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>