ఆహార భద్రత చట్టం అమలు తీరుపై తనిఖీలు

కలం, ఆదిలాబాద్ : ఆహార భద్రత చట్టం – 2013 అమలు తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు తెలంగాణ ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీకాంత్ రెడ్డి మంగళవారం ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా గుడిహత్నూర్, సీతాగొంది, పొన్నారి, కోడథ్ గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, రేషన్ దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

గుడిహత్నూర్‌లోని అంగన్‌వాడీ కేంద్రం, జెడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించిన చైర్మన్ చిన్నారులు, విద్యార్థులకు అందుతున్న పౌష్టికాహారం, ఇతర సేవలపై వివరాలు తెలుసుకున్నారు. సీతాగొంది అంగన్‌వాడీ కేంద్రంలో లబ్ధిదారులకు అందుతున్న పౌష్టికాహారం, కేంద్రం ద్వారా అందిస్తున్న సేవలను పరిశీలించారు. పొన్నారి, కోడథ్ గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలు, రేషన్ దుకాణాలను తనిఖీ చేసి సరుకుల నిల్వలు, పంపిణీ విధానం, లబ్ధిదారులకు అందుతున్న సేవలను పరిశీలించారు.

పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిని ఫుడ్ కమిషన్ చైర్మన్ సందర్శించారు. ముఖ్యంగా చిన్నారుల వార్డును పరిశీలించి అక్కడ అందుతున్న వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సదుపాయాలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని వైద్యులను సూచించారు. ఈ పర్యటనలో డీఎస్ఓ నందిని, డీఎం సుధారాణి, డీఆర్‌డీఓ పీడీ రవీందర్ రాథోడ్, డీఈఓ మాధవి, డీడబ్ల్యూఓ మిల్కా పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>