ఉపాధ్యాయుల సేవలు సమాజ నిర్మాణానికి పునాది : బీర్ల అయిలయ్య

కలం, యాదగిరిగుట్ట: పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యాదగిరిగుట్ట మండల స్థాయిలో విద్యార్థులకు ఉత్తమ విద్యాబోధన అందిస్తూ విశిష్ట సేవలు అందిస్తున్న ఉపాధ్యాయులకు అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య (Beerla Ilaiah) ముఖ్య అతిథిగా హాజరై మండలంలోని ఉపాధ్యాయులకు అవార్డులు అందజేశారు.

ఈ సందర్బంగా అయిలయ్య మాట్లాడుతూ, విద్యార్థులకు కేవలం పాఠ్యాంశాలను బోధించడమే కాకుండా, వారిలో క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యత, దేశభక్తి వంటి లక్షణాలను పెంపొందించడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఒక విద్యార్థి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు కూడా కీలక పాత్ర పోషిస్తారని అన్నారు. సమాజానికి అవసరమైన ఉత్తమ పౌరులను తయారు చేయడంలో ఉపాధ్యాయుల సేవలు అమూల్యమైనవని ఎమ్మెల్యే (Beerla Ilaiah) కొనియాడారు.

విద్యారంగంలో ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని గుర్తించి వారిని ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. మండల స్థాయిలో ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులను అవార్డులతో సత్కరించడం ద్వారా వారి సేవలకు గుర్తింపు లభించడంతో పాటు, ఇతర ఉపాధ్యాయులకు కూడా మరింత ఉత్సాహం కలుగుతుందని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అంకితభావంతో పనిచేస్తున్న ప్రతి ఉపాధ్యాయుడికి అభినందనలు తెలిపారు.

అవార్డులు అందుకున్న ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించి, భవిష్యత్తులోనూ విద్యార్థుల అభ్యున్నతి కోసం మరింత అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, మండల ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>