కలం, వెబ్ డెస్క్ : టీ20 వరల్డ్ కప్(T20 World Cup) ఫైనల్‌కు భారత్(India), న్యూజిలాండ్(New Zealand) సన్నద్ధం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత స్పిన్ బౌలింగ్‌పై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. కొన్ని మ్యాచ్‌లుగా ఫామ్ కోల్పోయిన వరుణ్ చక్రవర్తిని (Varun Chakaravarthy) పక్కనబెట్టాలని, అతడి స్థానంలో కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav)ను జట్టులోకి తీసుకోవాలన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఫైనల్ ఆడే జట్టులో వరుణ్‌కు తొలగించారంటూ కొందరు తమ ఊహాజనిత జట్టును కూడా షేర్ చేస్తున్నారు. ఈ చర్చ రోజురోజుకు అధికం అవుతున్న క్రమంలో దీనిపై న్యూజిలాండ్ మాజీ పేసర్ సైమన్ డౌల్ (Simon Doull) కీలక వ్యాఖ్యలు చేశారు. ఫైనల్ వంటి కీలక మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తినే కొనసాగించాలని ఆయన భారత యాజమాన్యానికి సూచించారు.
ఈ పరిస్థితుల్లో కుల్దీప్‌ను తీసుకోవాల్సిన అవసరం లేదని డౌల్ అభిప్రాయపడ్డారు. గతంలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో కుల్దీప్ బౌలింగ్‌ను కివీస్ బ్యాటర్లు సులువుగా ఎదుర్కొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌ను రీడ్ చేయడం ఇప్పటికీ బ్యాటర్లకు అంత సులభం కాదని ఆయన పేర్కొన్నారు. వరుణ్ చక్రవర్తి బలహీనమైన బౌలర్ ఏమీ కాదని, ఆయన అత్యంత ప్రతిభావంతుడని డౌల్ (Simon Doull) కొనియాడారు. ప్రత్యర్థి జట్లు ఎన్ని వీడియోలు చూసినా, స్లో మోషన్ రిప్లేలు గమనించినా.. మైదానంలో ఉండే ఒత్తిడిలో వరుణ్ బంతులను అంచనా వేయడం కష్టమని ఆయన వివరించారు. అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ మార్పులు చేయకుండా వరుణ్‌తోనే వెళ్లడం ఉత్తమమని స్పష్టం చేశారు.
ఈ టోర్నీలో వరుణ్ చక్రవర్తి 8 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీసి భారత్ తరపున లీడింగ్ వికెట్ టేకర్‌గా ఉన్నారు. అయితే, ఆయన ప్రదర్శన గ్రాఫ్ క్రమంగా తగ్గుతూ వస్తోంది. మొదటి కొన్ని మ్యాచ్‌ల్లో 9 వికెట్లు పడగొట్టిన వరుణ్, గత నాలుగు మ్యాచ్‌ల్లో సగటున ఒక వికెట్ మాత్రమే తీశారు.
Read Also: ఆఫ్ స్పిన్‌పై అభిషేక్ స్పెషల్ ప్రాక్టీస్
Follow Us On: Facebook

