Mobile Popup Ad
Mobile Popup Ad

ఆఫ్ స్పిన్‌పై అభిషేక్ స్పెషల్ ప్రాక్టీస్

క‌లం, వెబ్ డెస్క్‌: టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో తలపడనున్న వేళ, టీమ్ ఇండియా ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) తన బలహీనతపై ఫోకస్ పెట్టాడు. ఈ టోర్నీలో ఆఫ్‌స్పిన్నర్ల చేతిలో వరుసగా దెబ్బతింటున్న అభిషేక్.. టైటిల్ పోరుకు ముందు అహ్మదాబాద్ నెట్స్‌లో ప్రత్యేకంగా చెమటోడ్చుతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు అభిషేక్ శర్మ ఆదివారం ప్రాక్టీస్‌లో స్థానిక ఆఫ్‌స్పిన్నర్లతో పాటు తిలక్ వర్మ బౌలింగ్‌ను ఎదుర్కొన్నారు. నెట్స్‌లో సుదీర్ఘంగా గడిపిన ఆయన, ఆఫ్‌స్పిన్‌పై చక్కని కట్ షాట్లు, గ్లాన్స్ షాట్లు ఆడారు. ముఖ్యంగా గ్రౌండ్ డౌన్ ది వికెట్ వచ్చి ఒక అద్భుతమైన సిక్సర్‌తో అలరించారు.

న్యూజిలాండ్ స్పిన్నర్ కోల్ మెక్కాన్చీ ఫైనల్‌లో అభిషేక్‌కు పెద్ద సవాల్‌గా మారే అవకాశం ఉంది. సెమీఫైనల్‌లో మెక్కాన్చీ కీలక వికెట్లు తీసి జోరు మీదున్నారు. ఇప్పటికే వరుస డకౌట్లు, కడుపు ఇన్ఫెక్షన్‌తో ఇబ్బంది పడిన అభిషేక్.. ఈ ఫైనల్‌లో రాణించాలని మేనేజ్‌మెంట్ గట్టిగా కోరుకుంటోంది.

ప్రస్తుతం టీ20ల్లో నంబర్ 1 బ్యాటర్‌గా ఉన్నా, ఈ మెగా టోర్నీలో అభిషేక్ ప్రదర్శన నిరాశాజనకంగా ఉంది. సల్మాన్ అలీ ఆఘా, ఆర్యన్ దత్, విల్ జాక్స్ వంటి ఆఫ్‌స్పిన్నర్లకు ఆయన వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు. స్పిన్ బౌలింగ్‌లో కేవలం 8.50 సగటుతో 34 పరుగులు మాత్రమే చేయడం గమనార్హం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>