Mobile Popup Ad
Mobile Popup Ad

వరంగల్‌కు ఇచ్చిన హామీ నెర‌వేర్చుకున్నాం: క‌డియం కావ్య‌

క‌లం, వెబ్ డెస్క్‌: అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజీ విష‌యంలో వ‌రంగ‌ల్‌కు ఇచ్చిన హామీ నెర‌వేర్చుకున్నామ‌ని ఎంపీ క‌డియం కావ్య (Kadiyam Kavya) అన్నారు. డ్రైనేజీ నిర్మాణం కోసం ప్ర‌భుత్వం రూ.5,277 కోట్లు విడుద‌ల చేస్తూ జీవో జారీ చేసిన సంద‌ర్భంగా ఎంపీ కావ్య‌, ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ ప‌దేళ్ల పాల‌న‌లో వ‌రంగ‌ల్‌ (Warangal)ను నాశ‌నం చేసింద‌ని కావ్య అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి వ‌రంగ‌ల్ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నార‌ని తెలిపారు. డ్రైనేజీ నిర్మాణానికి ఇప్ప‌టికే డీపీఆర్‌ కూడా సిద్ధంగా ఉంద‌ని, త్వరలోనే పనులు కూడా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామ‌ని చెప్పారు. గత పాలకులు మాట‌లు చెప్ప‌డం త‌ప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేద‌న్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>