మాజీ ఎమ్మెల్యేకు సొంతపార్టీ కార్యకర్తల నుంచి నిరసన సెగ

కలం, మెదక్ బ్యూరో : గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి(Narasareddy)కి సొంత పార్టీ కార్యకర్తల నుండే నిరసన సెగ తగిలింది. బుధవారం ఆయన మెదక్ జిల్లా తూప్రాన్ మండలం కిష్టాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పరిశీలనకు వచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తలకు సమాచారం ఇవ్వకుండా, ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేసిన నాయకులతో కలిసి వచ్చాడు. దీంతో ఆగ్రహించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు, తమకు సమాచారం ఇవ్వకుండా, కొత్త గా వచ్చిన వారితో కలిసి గ్రామంలో ఎలా పర్యటిస్తారని అడ్డుకొని నిలదీశారు. దీంతో పాత, కొత్త కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మధ్య వాగ్వాదం, తోపులాట చేటుచేసుకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>