భద్రాచలంలో ఏసీబీకి చిక్కిన అటవీ అధికారులు

కలం, ఖమ్మం బ్యూరో: అటవీ శాఖకు చెందిన ఇద్దరు అవినీతి అధికారులు ఏసీబీ వలకు చిక్కారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం (Bhadrachalam) ఎఫ్‌డీఓ సుజాత, చర్ల ఇన్‌ఛార్జి డీఆర్ఓ కృష్ణయ్య ఓ కాంట్రాక్టర్ నుంచి రూ. 3.5 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ ఆధ్వర్యంలో బృందం భద్రాచలంలోని ఆమె కార్యాలయంలోనే​ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. చర్ల మండలం పూసుగుప్ప ప్రాంతంలో సదరు కాంట్రాక్టర్ రోడ్డు నిర్మాణ పనులు చేస్తుండగా.. పలు చెట్లు ధ్వంసం అయ్యాయి. దీంతో కాంట్రాక్టర్‌పై కేసు నమోదు చేసేందుకు ప్రయత్నించారు.

రూ.10 లక్షలు డిమాండ్.. రూ.3.50 లక్షలకు ఓకే..

కాంట్రాక్టరుతో చర్చల తరువాత కేసు నమోదు చేయకుండా ఉండాలంటే రూ. 10 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించగా.. ముందే నిర్ణయించుకున్న రూ. 3.50 లక్షలు తీసుకుంటుండగా ఎఫ్‌డీ‌వో సుజాత, చర్ల ఇన్‌ఛార్జి రేంజ్ ఆఫీసర్ కృష్ణయ్యను పట్టుకున్నారు. వీరిద్దరిపై కేసులు నమోదు చేసి ఏసీబీ కోర్టులో హాజరు పర్చనున్నట్లు డీఎస్పీ తెలిపారు. గతంలో కూడా కొత్తగూడెం అటవీ అభివృద్ధి సంస్థ జిల్లా అధికారి రూ.3.5 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. అవినీతి అధికారులపై ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1046కి కాల్ చేసి సమాచారం అందించాలని ఏసీబీ డీఎస్పీ సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>