దేవరకొండలో ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు తనిఖీలు

కలం, దేవరకొండ: ప్రజారోగ్యమే ధ్యేయంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. నల్గొండ జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి శివ శంకర్ రెడ్డి దేవరకొండ (Devarakonda) పట్టణంలోని పలు వ్యాపార సంస్థల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు చేపట్టారు. బస్టాండ్ ప్రాంగణంలోని శివ గంగా ట్రేడర్స్, తిరునాల రోటరీ ఆయిల్ మిల్, నందిని సంస్థలను అధికారి తనిఖీ చేశారు. సదరు సంస్థలు చెల్లుబాటు అయ్యే ఫుడ్ లైసెన్స్ లేకుండానే వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు నిర్ధారించారు. 15 లీటర్ల టిన్ల నుండి గానుగ యంత్రాల ద్వారా లూజ్ ఆయిల్స్‌ను విక్రయిస్తున్నట్లు గుర్తించి, వాటిపై చర్యలు తీసుకున్నారు. నాణ్యతపై అనుమానం ఉన్న మూడు రకాల ఆయిల్ నమూనాలను సేకరించి, విశ్లేషణ కోసం ల్యాబ్‌కు పంపారు.

గానుగ కేంద్రాలలో కేవలం మంచి నాణ్యత కలిగిన వేరుశెనగలను, నాణ్యమైన ముడి పదార్థాలను మాత్రమే వినియోగించాలని, వ్యాపార ప్రాంగణాన్ని అత్యంత శుభ్రంగా ఉంచుకోవాలని, ముడి పదార్థాలను సురక్షితమైన ప్రదేశాల్లో నిల్వ చేయాలని ఆదేశించారు. ప్రతి ఫుడ్ బిజినెస్ నిర్వాహకుడు తప్పనిసరిగా ప్రభుత్వ లైసెన్స్ కలిగి ఉండాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు తమ ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా బయట విక్రయించే లూజ్ ఆయిల్స్‌ను కొనుగోలు చేయవద్దని అధికారి శివ శంకర్ రెడ్డి కోరారు. ప్రజారోగ్య పరిరక్షణ కోసం తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>