కలం, వెబ్‌డెస్క్: కర్ణాటక (Karnataka) రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లా మూడబిద్రి (Moodabidri) లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. దైవ బండార ఊరేగింపు కార్యక్రమం సాగుతుండగా అకస్మాత్తుగా భక్తులు నడుచుకుంటూ వెళుతున్న కాలినడక వంతెన కూలిపోయింది. ఈ ఘటనలో 10 అడుగుల ఎత్తు నుంచి భక్తులు నీటిలో పడిపోయారు. వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

