కలం, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఫ్యామిలీ కోయంబత్తూరుకు పయనమైంది. కొద్ది రోజుల క్రితం పెద్ది సినిమా షూటింగ్ సమయంలో రామ్ చరణ్ (Ram Charan)కు గాయమైన సంగతి తెలిసిందే. మణికట్టుకు గాయం కాగా చరణ్ మూమూలుగా కట్టు కట్టించుకొని సినిమా ప్రమోషన్లు చేశాడు. అయితే మణికట్టు గాయానికి శస్త్ర చికిత్స చేయించుకోవాలని డాక్టర్లు సూచించారు. ఈ నేపథ్యంలో కోయంబత్తూరులోని గంగా ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకునేందుకు చరణ్ బయలుదేరాడు.
సోమవారం మధ్యాహ్నం ఈ ఆపరేషన్ జరుగనుంది. ఈ సమయంలో చరణ్‌కు తోడుగా ఉండేందుకు ఉపాసనతో పాటు చిరంజీవి దంపతులు కోయంబత్తూరు బయలుదేరారు. అయితే హైదరాబాద్‌లో ఉపాసన కుటుంబ సంస్థ అయిన అపోలో ఉండగా రామ్ చరణ్ శస్త్ర చికిత్స కోసం కోయంబత్తూరుకు ఎందుకు వెళ్తున్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

