కలం, మెదక్ బ్యూరో: నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు (Raghunandan Rao) తెలిపారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పదో తరగతి పేపర్ లీకైందని.. సీఎం రేవంత్ రెడ్డి కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
సదాశివపేటలో ఎంపీ రఘునందన్ రావు మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే యువతకు అవకాశాలు ఇస్తామని చెప్పడం కాదు, ముందుగా తెలంగాణ ప్రభుత్వంలో 30 ఏళ్లలోపు యువ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చి చిత్తశుద్ధిని నిరూపించుకోండని సవాల్ విసిరారు.

