Mobile Popup Ad
Mobile Popup Ad

జనగణనలో వివరాలు నమోదు చేసిన సీఎం రేవంత్

కలం, వెబ్ డెస్క్: జనగణన 2027లో భాగంగా తెలంగాణలో నేటి నుంచి ‘సెల్ఫ్ ఎన్యుమరేషన్’ ప్రక్రియ ప్రారంభమైంది. తాజాగా సెన్సస్ 2027 స్వీయ నమోదు (Self-Enumeration) కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) పాల్గొన్నారు. అధికారిక వెబ్ పోర్టల్ ద్వారా తన వివరాలను స్వయంగా సీఎం నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా సెన్సస్ అధికారులు స్వీయ నమోదు ప్రక్రియ విధానం, ప్రాముఖ్యత గురించి ముఖ్యమంత్రికి వివరించారు. ఖచ్చితమైన, సమర్థవంతమైన డేటా సేకరణకు స్వీయ నమోదు కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రతి పౌరుడు సెన్సస్ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని, స్వీయ నమోదు సదుపాయాన్ని వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రణాళికల అమలుకు ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టర్ భారతి హోలికేరి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, జాయింట్ ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ ప్రియాంక అలా, ఐ&పీఆర్ కమిషనర్ చెక్కా ప్రియాంక తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>