కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో డీజిల్ కొరత (Diesel Shortage) తీవ్రతరం అవుతోంది. ఇరాన్, అమెరికా యుద్ధం ప్రభావం వల్ల ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో తీవ్ర డీజిల్ కొరత నెలకొంది. ముఖ్యంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సగానికి పైగా పెట్రోల్ బంకుల్లో డీజిల్ నిల్వలు లేవు. జాతీయ ప్రధాన రహదారుల పక్కన ఉన్న అనేక బంకుల్లో డిజిల్ నో స్టాక్ అనే బోర్డులే దర్శనమిస్తున్నాయి. దీంతో వినియోగదారులు డీజిల్ కోసం అల్లాడిపోతున్నారు.
డీజిల్ కొరత వలన వాహనదారులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రబీ సీజన్ లో వరి కోతలు ముమ్మరంగా కొనసాగుతున్న వేళ డీజిల్ లభించడకపోవడం రైతులకు పెద్ద సవాల్ గా మారింది. వరికోత యంత్రాలు నిలిచిపోవడంతో కోతలు ఆలస్యమవుతున్నాయి. దీనివల్ల వ్యవసాయ రంగ పనులు నిలిచిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. డీజిల్ కొరతను వెంటనే తీర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

