హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని పలు హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. బస్టాండ్ సమీపంలోని సిద్ధార్థ హోటల్‌‌లో జిల్లా ఇన్‌ఛార్జి ఆహార భద్రత అధికారి సునీత ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ఆహార పదార్థాల్లో వినియోగిస్తున్న కలర్లను గుర్తించి పారబోశారు. అనంతరం హోటల్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు.

హోటల్ కిచెన్‌ పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. నాణ్యత కలిగిన చికెన్, కూరగాయలను మాత్రమే ఉపయోగించాలన్నారు. ఫ్రిజ్‌‌ల్లో ఎక్కువ కాలం నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను ఉపయోగించి బిర్యానీ తదితర వంటకాలు తయారు చేయొద్దన్నారు. అలా చేస్తే ఫుడ్ లైసెన్స్ రద్దు చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>