కలం, సోన్ : సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని సోన్ మండలం(Soan Mandal)లో గురుపూజోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో విశిష్ట సేవలందిస్తున్న 17 మంది ఉపాధ్యాయులను మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి బద్దం హరీష్‌రెడ్డి మాట్లాడుతూ.. తరగతి గది నాలుగు గోడల మధ్య దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శిల్పులు ఉపాధ్యాయులేనని అన్నారు. విద్యార్థులకు విద్యాబోధనతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యతలను నేర్పుతూ ఉపాధ్యాయులు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యాశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

