భార్యాభర్తల మధ్య ‘వంటకాల’ చిచ్చు.. ‘ఫుడ్ డైవోర్స్’‌తో దూరందూరంగా!

కలం, వెబ్ డెస్క్: ఢిల్లీకి చెందిన ఐటీ నిపుణుడు రోహిత్ ఖన్నా, అతని భార్య రియా మధ్య మంచి రిలేషన్ ఉంది. కానీ వారిద్దరి ఆహారపు అలవాట్లు చాలా భిన్నంగా ఉంటాయి. ఒకరికి ఇష్టమైన ఫుడ్, మరొకరికి నచ్చకపోవడంతో భోజన వేళల్లో కలయిక తగ్గిపోయింది. రోహిత్ తన ఫిట్‌నెస్ దృష్ట్యా ప్రోటీన్ షేక్స్ వెజ్ వంటకాలను మాత్రమే తినడానికి ఇష్టం చూపుతున్నాడు. భార్య రియా మాత్రం తనకు నచ్చిన చికెన్, మటన్ వంటకాలతోపాటు, ఈవెనింగ్ స్నాక్స్ తింటూ ఎలాంటి కఠినమైన ఆహార నియమాలను పాటించడం లేదు. దీనివల్ల దంపతుల మధ్య దూరం పెరిగింది. విడివిడిగా భోజనం చేయడం, వాగ్వాదాలు జరగడం లాంటి చోటుచేసుకుంటున్నాయి.

ఈ ఆహారపు అలవాట్ల వ్యత్యాసాల కారణంగా బ్రిటన్‌లో ‘ఫుడ్ డివర్స్’ (Food Divorce)  అనే సరికొత్త ట్రెండ్ తెరపైకి వచ్చింది. అంటే నిజమైన విడాకులు కాకుండా, ఒకే ఇంటిలో ఉంటూ ఎవరికి నచ్చిన ఆహారాన్ని వారు వండుకుని విడివిడిగా తినడమే ఈ పద్ధతి. అయితే “కలిసి భోజనం చేసే కుటుంబం కలకాలం కలసి ఉంటుంది” అనే భావన బలంగా వేళ్లూనుకున్న భారతీయ సమాజంలో ఈ ట్రెండ్ ఎంతవరకు ఉంటుందనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.

నేటి ఆధునిక జీవనశైలిలో ఫిట్‌నెస్, కీటో, వీగన్ డైట్లు, బరువు తగ్గించే మందుల వాడకం పెరగడం వల్ల ఇద్దరు భాగస్వాముల ఆహారపు అలవాట్లలో వ్యత్యాసాలు వస్తున్నాయి. కొందరు దీనివల్ల గొడవలు తగ్గించుకోవడానికి విడివిడిగా తినడాన్ని ఎంచుకుంటుండగా, మరికొందరు మాత్రం ఎంతటి భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ సర్దుకుంటూ కుటుంబంతో కలిసి భోజనం చేసేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>