క్యాబ్ యాప్‌లకు షాక్.. అడ్వాన్స్ టిప్ ఆప్షన్లకు చెక్!

కలం, వెబ్ డెస్క్​ : కేంద్ర ప్రభుత్వం రైడ్ హెయిలింగ్ యాప్‌లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉబర్, ఓలా వంటి క్యాబ్ యాప్‌లలో ప్రయాణికులు రైడ్ బుక్ చేసుకునే ముందే టిప్ (Cab Tipping) ఇచ్చే పద్ధతికి స్వస్తి పలకాలని స్పష్టం చేసింది.

త్వరగా క్యాబ్ వస్తుందనే ఆశతో ప్రయాణికులు ముందస్తుగా డబ్బులు చెల్లించేలా ప్రోత్సహించకూడదని సూచించింది. ఇందుకోసం ‘అడ్వాన్స్ టిప్’, ‘క్విక్ రైడ్ కన్ఫర్మేషన్’ వంటి ఆప్షన్లను తమ ప్లాట్‌ఫామ్‌ల నుంచి తక్షణమే తొలగించాలని మోటార్ వెహికల్ అగ్రిగేటర్లను ఆదేశించింది.

టిప్ ఇవ్వడం వల్ల మాత్రమే డ్రైవర్ రైడ్ అంగీకరిస్తాడనే భావన ప్రయాణికుల్లో కలగకూడదని వెల్లడించింది. అయితే, ప్రయాణం పూర్తయిన తర్వాత డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ప్రయాణికులు తమకు నచ్చితే స్వచ్ఛందంగా టిప్ ఇవ్వవచ్చని స్పష్టం చేసింది. ఈ మొత్తాన్ని ఎలాంటి కోతలు లేకుండా పూర్తిగా డ్రైవర్‌కే అందించాలని పేర్కొంది. మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్‌లైన్స్-2025 ప్రకారం యాప్‌లలో ఈ మార్పులు తక్షణమే అమలు చేయాలని స్పష్టం చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>