దేవరకద్ర గురుకుల కళాశాలలో అదనపు కలెక్టర్ తనిఖీ.. వసతులపై ఆరా

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: దేవరకద్ర (Devarakadra) మండలంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థ (TGSWRS) జూనియర్ కళాశాల, హాస్టల్‌ను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ (Additional Collector) మధుసూదన్ నాయక్ (Madhusudan Naik) గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళాశాల, హాస్టల్‌లోని వంటగది పరిశుభ్రత, విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యత, మౌలిక వసతులు, హాస్టల్ సేవలను ఆయన పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారి విద్యాభ్యాసం, విద్యా ప్రమాణాలు, హాస్టల్‌లో అందుతున్న సౌకర్యాలు, సంక్షేమానికి సంబంధించిన అంశాలను అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థుల సమస్యలు, అవసరాలను తెలుసుకున్న అదనపు కలెక్టర్ వాటి పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి, వారికి అందిస్తున్న ఆహారం నాణ్యతను ప్రత్యక్షంగా పరిశీలించారు. విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన ఆహారం అందించాలని, విద్యా, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను సూచించారు. ఈ తనిఖీలో దేవరకద్ర ఎంపీఓ కళాశాల ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>