గురుకుల విద్యార్థుల మధ్యాహ్న భోజన మెనూలోకి చేపలు కూడా చేర్చనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam) వెల్లడించారు. ఇప్పటి వరకు చికెన్, మటన్ అందించామని, అతి త్వరలో వాటితో పాటు చేపలు కూడా పెట్టాలని తాము నిర్ణయించామని చెప్పారు. ఈ ఆలోచనను మంత్రి వాకిటి శ్రీహరి తన దృష్టికి తీసుకొచ్చారని పేర్కొన్నారు. శ్రీహరి సూచనల మేరకు గురుకుల మెనూలో చేపల కూరను చేర్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని స్పష్టం చేశారు. శనివారం హుస్నాబాద్ పర్యటనలో భాగంగా ఇద్దరు మంత్రులు మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ కాలంలో చేప పిల్లల పెంపకంలో కొన్ని లోపాలు జరిగాయని, చిన్న సైజ్ చేప పిల్లల కారణంగా సమస్యలు ఎదురయ్యాయని పొన్నం ప్రభాకర్ అన్నారు.
హుస్నాబాద్‌కు మూడు లక్షల చేప పిల్లలు పంపిణీ చేసినట్లు, మరికొన్ని 60 వేల చేప పిల్లలు ఇవ్వాలని శ్రీహరి(Minister Srihari)కి అభ్యర్థించినట్లు తెలిపారు. ఎల్లమ్మ చెరువుకు వచ్చే పర్యాటకుల కోసం చేపల మార్కెట్ ఏర్పాటు చేయాలని సూచించారు. అక్కన్నపేట ఫోర్ లైన్ రోడ్డుకు రూ.50 కోట్లు మంజూరైనట్లు వెల్లడించారు. గ్రామీణ పశుసంపద అభివృద్ధికి గోపాల మిత్రలు చేస్తున్న కృషిని పొన్నం ప్రభాకర్(Minister Ponnam) ప్రశంసించారు. వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని శ్రీహరిని కోరారు. హుస్నాబాద్‌లో నిర్మించనున్న వెటర్నరీ హాస్పిటల్‌ను అన్ని సౌకర్యాలతో పూర్తి చేయాలని, అసంపూర్తిగా ఉన్న మోడరన్ చేపల మార్కెట్‌ను కూడా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. వెటర్నరీ పోస్టును తక్షణం మంజూరు చేయాలని వినతి పత్రం ద్వారా కోరారు.
Read Also: స్థానిక ఎన్నికలపై నిర్ణయం ? – ఎల్లుండి క్యాబినెట్ భేటీ
Follow Us on : ShareChat

