కలం వెబ్ డెస్క్ : కేరళ(Kerala)లోని త్రిశూర్ రైల్వే స్టేషన్(Thrissur railway station)లో ఆదివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం(fire accident) చోటు చేసుకుంది. ఈ ఘటనలో రైల్వే ష్టేషన్ పార్కింగ్(parking)లో ఉన్న సుమారు 400 బైకులు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని వెల్లడించారు. విద్యుత్ తీగల నుంచి వచ్చిన నిప్పు రవ్వల వల్ల మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. వాహనాలు దగ్ధమవుతున్న సమయంలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా(Social Media)లో వైరల్‌గా మారాయి.


