Mobile Popup Ad
Mobile Popup Ad

మేడిగడ్డ ఎల్ అండ్ టీ కార్యాలయంలో అగ్నిప్రమాదం.. కీలక పత్రాలు దగ్ధం!

కలం, వరంగల్ బ్యూరో: జయశంకర్ భూపాలపల్లి (Jayashankar Bhupalpally) జిల్లా మేడిగడ్డ (Medigadda) వద్ద ఉన్న ఎల్ అండ్ టీ నిర్మాణ సంస్థ కార్యాలయంలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అంబటిపల్లి వద్ద ఎల్ అండ్ టి సంస్థ తాత్కాలికంగా క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేయగా.. అక్కడ ఒక్కసారిగా మంటలు చెలరేగి కార్యాలయం మొత్తం వ్యాపించాయి.

సమీపంలోని పంట పొలాల్లో రైతులు పంట వ్యర్తాలు, గడ్డికి నిప్పు పెట్టారు. దీంతో మంటలు చెలరేగి కార్యాలయం వరకు విస్తరించాయి. అధికారులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిప్పు అంటుకొని ఏడు గదులు కాలిపోయాయి. ఈ ప్రమాదం లో కార్యాలయంలోని ఫైల్స్, కంప్యూటర్లు, ఫర్నిచర్ కాలిపోయాయినట్లు సిబ్బంది చెబుతున్నారు.

 

Reda Also: గుర్తింపు దక్కని అమరులెందరో..!

Read Also: క్యాన్సర్ రోగుల పాలిట సంజీవని.. డాక్టర్ సదాశివుడు!

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>