కలం స్పోర్ట్స్: యాషెస్ లీగ్‌లో ఫైనల్ టెస్ట్‌కు ఇంగ్లండ్ రెడీ అవుతోంది. నాలుగో టెస్ట్ విజయం ఇచ్చిన ఊపుతో ఈ ఐదో టెస్ట్‌లో కూడా ఆస్ట్రేలియాపై విజయం సాధించాలని వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఇంగ్లండ్ టీమ్‌లో మేనేజ్‌మెంట్ రెండు కీలక మార్పులు చేసింది. తాజాగా ఐదో టెస్ట్‌కు 12 మంది సభ్యులతో కూడిన జట్టును (England Team Squad) ప్రకటించింది. ఈ జట్టులో సీమర్ మ్యాథ్యూ పాట్స్, స్పిన్నర్ షోయబ్ బషీర్‌లకు అవకాశం లభించింది.
గస్ అట్కిన్సన్.. హ్యామ్‌స్ట్రింగ్(తొడ కండరాలు) గాయంతో తప్పుకున్నాడు. దాంతో అతని స్థానంలో పాట్స్ ఎంపికయ్యాడు. జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్ గాయాల కారణంగా ఇప్పటికే జట్టుకు దూరమయ్యారు. తుది జట్టులో చివరి స్థానం కోసం బషీర్, విల్ జాక్స్ మధ్య పోటీ కొనసాగుతోంది. ఐదు టెస్టుల సిరీస్‌లో ఆస్ట్రేలియా 3-1తో ఆధిక్యంలో ఉంది.
England Team Squad:
బెన్ స్టోక్స్ (కెప్టెన్), షోయబ్ బషీర్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, జాక్ క్రాలీ, బెన్ డకెట్, విల్ జాక్స్, మ్యాథ్యూ పాట్స్, జో రూట్, జేమీ స్మిత్, జోష్ టంగ్
Read Also: టీ20 వరల్డ్ కప్ ఆడే దక్షిణాఫ్రికా టీమ్ ఇదే !
Follow Us On : WhatsApp


