కలం, వెబ్ డెస్క్ : ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup 2026)లో పెను భూకంపం సృష్టించే వివాదం రేగింది. మెస్సీ టీమ్‌కు రెఫరీలు, వీఏఆర్ అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని ఈజిప్ట్ కోచ్ హొస్సామ్ హసన్ సంచలన ఆరోపణలు చేశారు. టోర్నమెంట్‌లో తమకు న్యాయం జరగలేదని మండిపడ్డారు. నిరసనగా మిగిలిన ప్రపంచకప్ మ్యాచ్‌లను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. అర్జెంటీనాకు అనుకూలంగా నిర్ణయాలు వస్తున్నాయనే విమర్శలు సోషల్ మీడియాలో మార్మోగిపోతున్నాయి.
అంతకుముందు మ్యాచ్‌లో అల్జీరియా కెప్టెన్‌పై మెస్సీ కాలు వేసినా రెడ్ కార్డ్ ఇవ్వలేదు. తాజాగా ఈజిప్ట్‌తో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లోనూ అదే రిపీట్ అయింది. ఈ మ్యాచ్‌లో ఈజిప్ట్ మొదట అద్భుతంగా ఆడింది. 15వ నిమిషంలో యాసర్ ఇబ్రహీం హెడర్ ద్వారా తొలి గోల్ చేశాడు. ఆ తర్వాత మెస్సీ పెనాల్టీ కిక్‌ను ఈజిప్ట్ కీపర్ షోబీర్ అద్భుతంగా డైవ్ చేసి అడ్డుకున్నాడు. 67వ నిమిషంలో మోస్తఫా జికో మరో గోల్ కొట్టాడు.
దీనితో ఈజిప్ట్ 2-0తో తిరుగులేని ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ ఆ తర్వాత అసలు డ్రామా మొదలైంది. ఈజిప్ట్ చేసిన ఒక క్లీన్ గోల్‌ను వీఏఆర్ ఫౌల్ అంటూ రద్దు చేసింది. దీనిపై తీవ్ర వివాదం రేగింది. ఆ గోల్ ఇచ్చి ఉంటే స్కోరు 3-3 అయ్యేది. ఈ గందరగోళాన్ని అర్జెంటీనా వాడుకుంది. 79వ నిమిషంలో రొమేరో హెడర్ ద్వారా గోల్ చేశాడు. నాలుగు నిమిషాలకే మెస్సీ మరో గోల్ కొట్టి స్కోరు సమం చేశాడు. ఆఖరి నిమిషాల్లో ఎంజో ఫెర్నాండెజ్ విన్నింగ్ గోల్ వేయడంతో అర్జెంటీనా 3-2తో గెలిచింది.
ఈ ఓటమిపై ఈజిప్ట్ కోచ్ హసన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్జెంటీనా ప్లేయర్లు తమను రెచ్చగొట్టడానికే ఆడారని ఆరోపించారు. రెఫరీ నిర్ణయాలు మ్యాచ్‌ను పూర్తిగా పాడు చేశాయన్నారు. ప్రతి రెండు నిమిషాలకు గొడవలు జరిగాయని, తమకు వ్యతిరేకంగా కార్డులు వాడారని చెప్పారు. ఈ వివాదం ఇప్పుడు ఫుట్‌బాల్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది.

