సీఎం ఇంటిని ముట్ట‌డించేందుకు ఫైబర్ నెట్ ఆపరేటర్ల య‌త్నం!

క‌లం, వెబ్ డెస్క్‌: ఏపీ సీఎం చంద్ర‌బాబు (CM Chandrababu) ఇంటి వ‌ద్ద తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొంది. ఉండవల్లిలోని కరకట్ట నివాసం వ‌ద్ద‌ సీఎం ఇంటిని ముట్టడించేందుకు ఫైబర్ నెట్ ఆపరేటర్లు (FiberNet Operators) ప్ర‌య‌త్నించారు. త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని కొద్ది రోజులుగా ఫైబ‌ర్ నెట్ ఆప‌రేట‌ర్లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు ప్ర‌భుత్వానికి విన్న‌వించుకున్నా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ నేడు సీఎం ఇంటి ముట్ట‌డికి ప్ర‌య‌త్నించారు. ఆప‌రేటర్ల‌ను పోలీసులు అడ్డుకున్నారు.

ఈ సంద‌ర్భంగా ఆప‌రేట‌ర్లు మీడియాతో మాట్లాడుతూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకుందామ‌ని వ‌స్తే పోలీసులు దౌర్జ‌న్యంగా వెళ్ల‌గొడుతున్నార‌ని ఆరోపించారు. పార్టీ ఆఫీసుకు వెళ్లాల‌ని, అక్క‌డికి వెళ్లి సీఎంను క‌లిస్తే స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంద‌ని చెప్తున్నార‌ని తెలిపారు. కానీ, ఇప్ప‌టికే చాలాసార్లు పార్టీ ఆఫీసుకు వెళ్లినా ఎలాంటి ఉప‌యోగం లేద‌ని చెప్పారు. అయితే మ‌రోసారి పార్టీ ఆఫీసుకు వెళ్తామ‌ని, ఈసారి త‌మ (FiberNet Operators) స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపించ‌క‌పోతే కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి పార్టీ ఆఫీసు ముందు ఆందోళ‌న చేస్తామ‌ని హెచ్చ‌రించారు.

Read Also: భారతదేశంలో ఎవరి మతం వాళ్లకు ఉంటుంది: వాకిటి శ్రీహరి

Follow Us On: X(Twitter)

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>