కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీనగర్ లో దారుణం చోటుచేసుకుంది. కన్నతండ్రి శ్రీశైలం తన కవల ఆడపిల్లలను బావిలో పడేసిన ఘటన (Father Kills Twin Girls) స్థానికంగా కలకలం రేపింది. బావిలో వెతకగా ఒక పాప మృతదేహం లభ్యం కాగా మరో పాప కోసం గాలింపు కొనసాగుతోంది. ఆగ్రహించిన గ్రామస్తులు నిందితుడికి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. భార్యభర్తల గొడవలే ఘాతుకానికి కారణమని భావిస్తున్నారు. ఆడబిడ్డలు పుట్టారన్న కారణంతోనే చంపేసి ఉంటాడని అనుమానిస్తున్నారు.
బిడ్డలు జన్మించినప్పటి నుంచి భార్యతో గొడవ పెట్టుకున్న ఆ తండ్రి చివరకు వారిద్దరినీ కడతేర్చారు. ఆ ఇద్దరి పిల్లల పేర్లు ముద్దుగా గీతాన్ శ్రీ, గీతాన్విక అని నామకరణం సైతం చేశారు. ఆడబిడ్డలేనన్న కర్కశంతో గొడవలు పడుతుంటే బంధువుల సర్ది చెప్పినా అతను వినలేదు. బిడ్డలిద్దరికీ (Father Kills Twin) గడ్డి మందు తాగించి బావిలో పడేసి హత్య చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. కరీంనగర్ రూరల్ సిఐ నిరంజన్ రెడ్డి కేసు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also: మేడారం ఘటన.. ప్రభుత్వంపై నెటిజన్లు ఫైర్
Follow Us On: Instagram

